Thu Mar 19 2026 12:54:30 GMT+0530 (India Standard Time)
kalvakuntla Kavitha : ఢిల్లీ ఎయిమ్స్ కు కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. దీంతో ఆమెను ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. దీంతో ఆమెను ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కవిత ఆరోగ్యం గత కొన్ని రోజులుగా బాగా లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కవిత తరచూ అస్వస్థతకు గురవుతున్నారు.
రేపు ఢిల్లీకి...
ఇటీవల ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం కూడా అందించారు. రేపు బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ లు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. కల్వకుంట్ల కవిత ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతో వారు వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. కాగా కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.
Next Story

